Friday 2 September 2011

వినాయక స్తుతి

గరిక పూజ తోడ గణుతికెక్కిన దేవ
కవిత వ్రాయు చుంటి గణపతయ్య
గరికి పాటి కవిత ఘనమైన కవితగా  
వాసి కెక్కు నటుల వరము నిమ్ము
--- గ.వెం.సు

1 comment:

  1. గరికపాటి వారి ఘనమైన పద్యాన
    గఱగఱికల భావగరిమ తోచు
    గిరయ? కాదు కావ్య ఝరులయ! తమబోంట్లు
    గఱగఱ సవరించఁ గళములోన

    ReplyDelete