Saturday 3 September 2011

ధన మహిమ

ధనమా ఎవ్వర వీవు? రాతి బోమవా? దైవాంశ సంభూతవా?
అనుజుల్ కొట్టుకు చత్తురే ధనముకై అమ్మా జగత్ వ్యాపినీ
ధనమున్ జూపగ లేచి వచ్చును గదా ధాత్రిన్ శవంబేని! యీ
ధనమా హాత్మ్యము శక్యమే తెలుపగన్ తల్లీ నమోవాకముల్

-- గ.వెం.సు




2 comments:

  1. పెదనాన్న గారు,

    ధనం గురించి ఆలోచిస్తే నాకు గుర్తొచ్చేది ఆది శంకరుడు అన్న:

    मूढ़ जहीहि धनागमतृष्णाम्,
    कुरु सद्बुद्धिमं मनसि वितृष्णाम्।
    यल्लभसे निजकर्मोपात्तम्,
    वित्तं तेन विनोदय चित्तं ॥२॥

    ఒకప్పుడు ఔదార్యానికి, ఔన్నత్యానికి, వైరాగ్యానికి చిరునామ అయిన మన దేశం ఈ రోజు కేవలం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉండటం మన దురదృష్టం.

    మన సంస్కృతి పరమాత్ముణ్ణి శివ"రూపాయ", విష్ణు"రూపాయ" అంటూ నెమ్మదిగా శివ, విష్ణువు తీసేసి రూపాయ లోకి పడిపోయింది.

    ReplyDelete