Saturday 3 September 2011

సామాన్యుని ఆవేదన

స్వార్థ చింతన లేక సంక్షేమమును కోరు
త్యాగ ధనులను కన్న ధాత్రి మనది
రాజ్య కాంక్షయు లేని రఘు కులోత్తముడు శ్రీ
రామచంద్రుని కన్న రత్న గర్భ
సుఖ భోగముల రోసి అఖిలంబు విడచిన
సిద్ధార్థు కన్నట్టి సింధు నేమి
పరదేశ వాసుల భరతంబు పట్టిన
జాతి పితను కన్న జన్మ భూమి

తే.గీ    

 కవిని సమ్రాట్టు చేసిన కల్పవల్లి
 కళల కాణాచి ఈ తల్లి కర్మ భూమి
ధన్యుడైతిని తల్లి ఈ  ధరణి పుట్టి
భారమనుకోకు  నను మోయ భరత మాత
-- గ.వెం.సు

No comments:

Post a Comment